70 ఏళ్ళు పూర్తి చేసుకున్న కీలుగుర్రం

Submitted on 19 February 2019
70 Years of ANR Keelugurram Movie-10TV

నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వర రావు, అంజలీదేవి జంటగా నటించగా, శోభనాచల స్టూడియోస్ బ్యానర్‌పై, మీర్జాపురం రాజా వారి దర్శకత్వంలో రూపొందిన అపురూప జానపద చిత్రం.. కీలుగుర్రం.. 1949 ఫిబ్రవరి 19 న విడుదలైన కీలుగుర్రం 2019 ఫిబ్రవరి 19 నాటికి విజయవంతంగా 70 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. తాపీ ధర్మారావు కథ, మాటలు అందించగా, మీర్జాపురం రాజా వారు నిర్మించి, దర్శకత్వం వహించారు. బ్రహ్మాండమైన కథ, కథనాలు, ముచ్చటగొలిపే పాటలు, నటీనటుల అద్భుత ప్రతిభ కలగలసి కీలుగుర్రం సినిమాని చరిత్ర సృష్టించిన చిత్రంగా, తెలుగు సినిమా పరిశ్రమలో సుస్థిర స్థానం సంపాదించేలా చేసాయి అనడంలో అతిశయోక్తి లేదు. సినిమాలో దృశ్యాలు ప్రేక్షకులను మంత్ర ముగ్థుల్ని చేసాయి.  ఘంటసాల సంగీతం సినిమాకి పెద్ద హైలెట్.. ఆహా ఒహో ఆనందం, భాగ్యము నాదేనోయి, చూచి తీరవలదా, మోహనమహా వంటి పాటలు వినే కొద్దీ వినాలనిపిస్తుంటాయి..

9 డైరెక్ట్ కేద్రాల్లో 100 రోజులు, లేటుగా రిలీజ్ అయిన 4 కేంద్రాల్లోనూ 100 రోజులు, మొత్తంగా 13 కేంద్రాల్లో శత దినోత్సవం జరుపుకున్న సినిమా కీలుగుర్రమే.. తెలుగు ప్రేక్షకులు రిపీటెడ్‌గా ఈ సినిమాని చూసారు. కీలుగుర్రం ఏఎన్నార్, అంజలీదేవిల కెరీర్‌లో మరపురాని చిత్రంగా మిగిలిపోయింది. ఈ సినిమాకి కథ, మాటలు, పాటలు : తాపీ ధర్మారావు, సంగీతం : ఘంటసాల, కెమెరా : డి.ఎల్.నారాయణ, ఎడిటింగ్ : ఆర్.ఎమ్.వేణు గోపాల్.

వాచ్ వీడియో...

Keelugurram
Akkineni Nageswara Rao
Anjali Devi
Ghantasala
Raja Saheb of Mirzapur

మరిన్ని వార్తలు