ఉమెన్ కాలేజ్‌లో టీచర్ల దారుణం..68 మంది బాలికల బట్టలు విప్పించి..

Submitted on 14 February 2020
68 girls Students forced to strip in bhuj college to prove they were not menstruating

మహిళా విద్యార్దుల పట్ల లెక్చరర్లు అకృత్యానికి పాల్పడ్డారు. కాలేజ్ లో చదివే 68మంది యువతులను  బట్టలు విప్పించి..వారు నెలసరిలో ఉన్నారా? లేదా? అని పరీక్షించిన దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది.   

గుజరాత్‌లోని భుజ్ ప్రాంతంలోగల శ్రీ సహజనంద్ బాలికల సంస్థ (ఎస్‌ఎస్‌జిఐ) లో పనిచేసే ఓ మహిళా ప్రిన్సిపల్ యువతుల పట్ల అనాగరికంగా ప్రవర్తించింది. కాలేజ్‌లో చదివే (జూనియర్ కాలేజ్) బాలికలు కాలేజ్ హాస్టల్‌లో ఉంటున్నారు. కాలేజ్ హాస్టల్ లో ఉండే కిచెన్ రూమ్ పక్కే ఉండే బాత్రూమ్ వెనుక భాగంలో ఉండే తోటలో వాడి పడేసిన శానిటరీ ప్యాడ్లు గమనించిన హాస్టల్  వార్డెన్.. ఈ విషయాన్ని ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లడంతో ప్రిన్సిపాల్ ఆగ్రహంతో ఊగిపోయారు.

కాలేజ్ ధార్మిక సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న కాలేజీ అనీ..నెలసరి వచ్చిన విద్యార్థినులను మిగతా స్టూడెంట్లు వారిని ముట్టుకోకూడదు. నెలసరి వచ్చిన ఆడపిల్లలు వంట గదిలోకి రాకూడదు. దేవుడి గదిలోకి రాకూడదనే నిబంధనలు ఉన్నాయి. దీంతో..బాత్రూమ్ వెనుకాల వాడేసిన శానిటరీ ప్యాడ్లు కనిపించడం ప్రిన్సిపాల్‌కు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అలా చేసినవారెవరో తెలుసుకోవాలనుకుంది. 

ఆ యువతుల్లో ఎవరు నెలసరిలో ఉన్నారో తెలుసుకునేందుకు కాలేజ్  ప్రిన్సిపాల్ రీటా రానింగా .. వాళ్లను బాత్రూమ్‌లోకి తీసుకెళ్లి బట్టలు విప్పించి పరీక్షించింది. హాస్టల్ లో ఉండే బాలికలందరినీ పిలిచింది. వరుసగా నిలబడమని హుకుం జారీ చేసింది. బాలికలందరినీ జైల్లో ఖైదీలను నిలబెట్టినట్లుగా నిలబెట్టింది. తప్పు చేసిందెవరూ చెప్పాలని నిలదీసింది.

భయంతో ఇద్దరు బాలికలు ముందుకు వచ్చి ఒప్పుకున్నారు. చాలా పెద్ద తప్పు చేశారంటూ ఆగ్రహంతో ఊగిపోయింది. ఇంకా ఎవరైనా ఉన్నారా? మీ మాటల్ని నమ్మను అంటూ..మరో ముగ్గురు మహిళా టీచర్లను పిలిచి మొత్తం విద్యార్థినులను ఒక్కొక్కరినీ బాత్రూమ్ లోకి తీసుకెళ్లి వాళ్లు నెలసరిలో ఉన్నారా? లేదా? అని పరీక్షలు చేయించింది. 

అలా మొత్తం 68మంది బాలికలను కళ్లెదుటే బట్టలు విప్పించి ప్రిన్సిపాల్ రీటా రానింగా నిర్దారించుకుంది. దీంతో పాపం ఆ బాలికలు సిగ్గుతో కుంగిపోయారు. తలెత్తుకోలేక మౌనంగా రోదించారు. ఓ బాధిత బాలిక మాట్లాడుతూ.. మహిళా టీచర్లే అయినా.. అలా చేస్తున్నప్పుడు తలెత్తలేకపోయాను. భయంకరమైన టార్చర్ అనుభవించాను’ సిగ్గుతో చచ్చిపోవాలని అనిపించింది అంటూ కన్నీళ్లతో ఆవేదన వెళ్లగక్కింది. 

ఈ విషయంపై కాలేజీ ట్రస్టీకి ఫిర్యాదు చేసినా వాళ్లు ఏమాత్రం పట్టించుకోలేదనీ పెద్ద విషయమేమీ కాదంటూ కొట్టిపడేశారని వాపోయింది. నెలసరి వచ్చినవారిని అంటరానివారిగా చూస్తున్నారనీ.. ఆ సమయంలో భోజనం చేయటానికి వాళ్లు సెపరేట్ గా ఉండే ప్లేట్లను తీసుకెళ్లాలనీ.. కాలేజ్ ప్రార్ధనల్లో కూడా పాల్గొనకూడదనీ..‘‘ఆ మూడు రోజులు’’ వాళ్లు వెనుక బెంచీలో వెలివేసినవారిలా కూర్చోవాలని నిబంధనలున్నాయని తెలిపింది సదరు బాలిక.  ఈ విషయాన్ని ఇక్కడితో వదిలిపెట్టేయాలని..ఎవ్వరికీ చెప్పవద్దని హెచ్చరించారని బాధిత విద్యార్ధుల తల్లిదండ్రులు తెలిపారు. ఈ ఘటన యూనివర్శిటీ అధికారుల దృష్టికి రావడంతో అసలేం జరిగిందో తెలుసుకునేందుకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. మరోవైపు కాలేజీ యాజమాన్యంపై తల్లిదండ్రులు ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నారు. 

ఈ విషయంపై కాలేజ్ ధర్మకర్త పీహెచ్ హిరానీని మీడియా ప్రశ్నించగా..'కాలేజ్ ధార్మిక సంస్థ ఆధ్వర్యంలో నడుస్తోంది..పూజలు పునస్కారాలు ఉంటాయి. కాబట్టి కొన్ని నిబంధనలు ఉంటాయి. బాలికల విషయంలో సదరు ప్రిన్సిపల్ చేసింది అన్యాయమే. ఆమెపై చర్యలు తీసుకంటామ'ని తెలిపారు. 

Read More>>ఈ బార్ గర్ల్.. ముంబై క్రైమ్ క్వీన్ గా ఎలా మారింది

Gujarat
Bhuj
68 girls Students
forced to strip in bhuj college
prove they were not menstruating

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు