సీసీటీవీలో సంచలనాలు: సమాజసేవ ముసుగులో బాలికలను ఇంటికి తీసుకెళ్లి!

Submitted on 5 May 2019
63years Senior Citizen exploits minors for 2 yrs

రోజూ గుడికి వస్తుంటాడు. అక్కడి పేద బాలికలకు బోజనాలు పెట్టడం. డబ్బులు ఇవ్వడం. మంచి బట్టలు కొనిస్తుంటాడు. అతను చేస్తున్న సామాజిక సేవకు అక్కడి జనం మెచ్చుకునేవారు. గొప్పమనసు కలవాడంటూ కీర్తించేవారు. అయితే సమాజసేవ ముసుగులో పైకి కనబడుతున్న ఆ వ్యక్తి అసలు స్వరూపం ఏమిటంటే.. అతడు ఓ నరరూప రాక్షసుడు. 63ఏళ్ల వయస్సులో కూడా కామవాంచలు తీర్చుకునేందుకు బాలికలను వాడుకునే కీచకుడు. వివారాల్లోకి వెళ్తే..  ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌‌లో విమల్‌ చంద్‌ అనే 63ఏళ్ల వృద్ధుడు బీమా సంస్థలో ఉన్నతోద్యోగిగా చేసి 2016లో రిటైర్‌ అయ్యాడు. భార్య అదే సంవత్సరంలో చనిపోగా.. కూతురు విదేశాల్లో ఉంటోంది.

రాజభవనం లాంటి ఇల్లు కట్టించుకున్న విమల్ చంద్.. అక్కడే దగ్గరలో ఉన్న గుడి వద్దకు రోజూ వెళ్లేవాడు. అక్కడ పేదరికంతో ఇబ్బందులు పడుతున్న బాలికలకు డబ్బులు ఇచ్చి మచ్చిక  చేసుకునేవాడు. అనంతరం వాళ్లను ఇంటికి పిలుచుకుని లైంగికదాడులకు పాల్పడ్డాడు. పోర్న్ వీడియోలు చూస్తూ.. చూపిస్తూ వాళ్లను అలాగే చేయాలంటూ బలవంతపెట్టి దారుణంగా ప్రవర్తించేవాడు. ఆ వృద్థుడు పైశాచిక చర్యలకు నరకం అనుభవించిన ఆరుగురు బాలికలను గుర్తించిన పోలీసులు విచారణ జరిపి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే వారు కాకుండా మరికొందరిని విమల్ చంద్ చంపికూడా ఉండవచ్చునని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

అసలు విషయం వెలుగులోకి ఎలా వచ్చిందంటే.. విమల్ చంద్ తన ఇంట్లోని హాలు, బెడ్‌రూం, లివింగ్‌ రూం, వంటగదితో పాటు బాత్‌రూంను కూడా మొత్తం 13 సీసీ కెమెరాలు పెట్టించుకున్నాడు. వీటిలో కొన్ని పాడవగా కశ్యప్‌ అనే టెక్నీషియన్‌ను పిలిచి చూపించాడు. కశ్యప్ వాటిని బాగుచేసే క్రమంలో సీసీ కెమెరాల్లోని దృశ్యాలను చూశాడు. వాటిని హార్డ్ డిస్క్‌లోకి ఎక్కించుకున్న కశ్యప్.. డబ్బు కోసం విమల్‌ చంద్‌ను బ్లాక్‌మెయిల్‌ చేయడం మొదలెట్టాడు. చివరికి విషయం పోలీసుల వరకు వెళ్లడంలో విమల్‌చంద్‌, కశ్య్‌పలను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో వారిని ప్రవేశపెట్టగా జరిగిన ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయవాదులు చంద్‌పై దాడి చేసి చితగ్గొట్టారు.
 

CCTV technician
Scandal
63years Senior Citizen
Minors
Vimal Chnad

మరిన్ని వార్తలు