ఆ సర్వేలో చెప్పిన జనం : మళ్లీ మోడీనే ప్రధాని కావాలి

Submitted on 11 March 2019
52 Percent Respondents Want Modi Back As PM

ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. పోలింగ్ కు పెద్దగా సమయం కూడా లేదు. గెలుపే లక్ష్యంగా అన్ని రాజకీయ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. అభ్యర్థుల ఎంపికపై ముమ్మరంగా కసరత్తు మొదలుపెట్టాయి. గెలుపుపై ఎవరికి వారు ధీమాగా ఉన్నా.. ఓటర్ తీర్పు తెలియాలంటే మే 23 వరకు ఆగాల్సిందే. ఎన్నికల షెడ్యూల్ వచ్చిందో లేదో అప్పుడే సర్వేల హడావుడి మొదలైంది.
Read Also : ‘సివిజిల్’ యాప్ :ఎల‌క్ష‌న్ కంప్ల‌యింట్స్ ఎవ‌రైనా చేయొచ్చు

మరోసారి ప్రధానిగా ఎవరు కావాలని కోరుకుంటున్నారు అని ఇండియా టీవీ-సీఎన్‌ఎక్స్ ఒపినీయన్ పోల్ నిర్వహించింది. ఇందులో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. 52శాతం మంది మోడీకే ఓటు వేశారు. ప్రధానిగా మళ్లీ మోడీ వస్తేనే బాగుంటుందన్నారు. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీకి 17శాతం ఓట్లు పడ్డాయి. 8శాతం మంది ప్రియాంక గాంధీ వైపు మొగ్గు చూపారు. 5శాతం మంది మాయవతి వైపు, 4శాతం మంది మమతా బెనర్జీ వైపు మొగ్గుచూపారు.

మరోసారి మోడీ ప్రధాని అయితే బాగుంటుందని 52శాతం కోరుకుంటే, 41శాతం మంది వ్యతిరేకించారు. 7శాతం మంది ఏమీ చెప్పలేము అన్నారు. మోడీనే ప్రధానిగా ఎందుకు కావాలని అనుకుంటున్నారు.. అని ప్రశ్నిస్తే.. మోడీకి ప్రత్యామ్నాయం లేరు.. అందుకే ఆయనే ప్రధాని కావాలి అని 36శాతం మంది అన్నారు. ధరల పెరుగుదలను  అదుపులో ఉంచారు.. అందుకే మోడీనే మళ్లీ ప్రధాని కావాలని 23శాతం మంది అభిప్రాయపడ్డారు. జాతీయ భద్రత విషయంలో మోడీని మించిన వారు లేరు అని 17శాతం మంది తమ వైఖరి వెల్లడించారు. మోడీ ఫారిన్ పాలసీకి 16శాతం ఓట్లు పడ్డాయి. మోడీ, ప్రియాంక గాంధీలో ఎవరు బెటర్ అని అడిగితే... 63శాతం మంది మోడీ వైపు మొగ్గుచూపారు.
Read Also : లైటింగ్ ఎఫెక్ట్ : ఎయిర్‌పోర్ట్‌ తరహాలో వ‌ర‌ల్డ్ క్లాస్ రైల్వే స్టేష‌న్లు

pm modi
want modi
india tv
cnx
opinion poll
loksabha elections 2019
Rahul gandhi
Priyanka Gandhi

మరిన్ని వార్తలు