న్యూ ఇయర్ రోజున ఆందోళనలు..

06:56 - January 2, 2018

ఢిల్లీ : దేశవ్యాప్తంగా ప్రజలు నూతన సంవత్సర వేడుకలు సంబరంగా జరుపుకుంటుంటే ఈశాన్య రాష్ట్రమైన అసోం ప్రజలు మాత్రం ఆందోళనతో గడిపారు. నేషనల్‌ రిజిస్టర్‌ సిటిజన్స్‌ ఆ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన జాబితాను ఆదివారం అర్థరాత్రి విడుదల చేయడమే ఇందుకు కారణం. రాష్ట్రంలో 1.9 కోట్ల మందిని మాత్రమై చట్టబద్ధమైన పౌరులుగా గుర్తిస్తూ ఎన్‌ఆర్‌సి తొలి ముసాయిదాను ప్రచురించింది. మొత్తం 3 కోట్ల 29 లక్షలమంది దరఖాస్తు చేసుకోగా.. అందులో 1కోటి 39లక్షమంది పేర్లు లేకపోవడంతో వారు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సోషల్‌ మీడియాలో సైతం పుకార్లు షికార్లుగా చక్కర్లు కొట్టాయి. దీనిపై స్పందించిన అధికారులు మరో జాబితాను త్వరలోనే విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ జాబితాలో పేరులేని 'నిజమైన పౌరులు' ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తుది జాబితాలో వారి పేర్లు తప్పకుండా ఉంటాయని అసోం సీఎం సోనోవాల్‌ అన్నారు. రాష్ట్రంలో ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా ప్రభుత్వం 50 వేల మిలటరీ, పారా మిలటరీ దళాలతో భద్రతా చర్యలు చేపట్టింది.

Don't Miss