పుట్ పాత్ పైకి దూసుకెళ్లిన కారు : ముగ్గురు చిన్నారులు మృతి

Submitted on 26 June 2019
3 children died SUV mowed then down while they were sleeping on the footpath in Agam Kuan Patna,

బీహార్ రాజధాని పాట్నాలో దారుణం చోటుచేసుకుంది. అదుపు తప్పిన కారు ఫుట్ పాత్ పైకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో పుట్ పాత్ పై నిద్రిస్తున్న ముగ్గురు చిన్నారులు అక్కడిక్కడే మృతి చెందారు. మరోవ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన చిన్నారుల బంధువుల రోదనలతో ఆ ప్రాంతమంతా నిండిపోయింది.  

పాట్నాలోని ఓల్డ్ బైపాస్ వద్దనున్న కుమ్హరార్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనపై స్థానికులు తీవ్రంగా స్పందించారు. తమ కళ్లముందే జరిగిన ఈ దారుణం చూసి ఆగ్రహం పట్టలేకపోయారు. దీంతో కారును ఆపి కారును ధ్వసం చేశారు.  డ్రైవర్ ను కారులో నుంచి దించి..చావబాదారు. ఈ దాడిలో డ్రైవర్ మృతి చెందాడు. 

ఈ ప్రమాదం ఘటనపై  సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడినవారిని  ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. అనంతరం దాడి స్థానికులను ప్రశ్నించగా..పోలీసులపై కూడా దాడికి దిగేందుకుయత్నించారు. దీంతో ఘటనా స్థలంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం డ్రైవర్ మద్యం మత్తులో కారును  ఫుట్‌పాత్ మీదికి ఎక్కించేశాడని తెలిపారు. .
 

BIHAR
patna
3 children died
Sleeping
Footpath


మరిన్ని వార్తలు