ఉగ్రదాడిలో ముగ్గురు బిడ్డలను కోల్పోయిన బిలీనియర్ పొవెల్సన్

Submitted on 22 April 2019
3 children of Asos billionaire killed in Sri Lanka attacks

శ్రీలంకలో జరిగిన ఉగ్రదాడుల్లో ప్యాషన్ రిటైలర్ కంపెనీ అసోస్ వ్యవస్థాపకుడు, బిలీనియర్ యాండర్స్ హోల్చ్ పొవెల్సన్ (46) తన ముగ్గురి పిల్లలను కోల్పోయారు. లంకలో వరుస బాంబు పేలుళ్ల ఘటనలో హోల్చ్ నలుగురు పిల్లల్లో ముగ్గురు మృతిచెందినట్టు ఓ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. డెన్మార్క్ లో పొవెల్సన్ అత్యంత ధనవంతుడు కాగా, స్కాట్లాండ్ లో ఈయనకు పెద్ద సొంత ఎస్టేట్ ఉన్నట్టు తెలిపారు. పొవెల్సన్ బిడ్డలు నలుగురిలో ఏ ముగ్గురు ఉగ్రదాడుల్లో మృతిచెందారో ధ్రువీకరించలేదన్నారు. ఈస్టర్ హాలిడే సందర్భంగా బిలీనియర్ పొవెల్సన్ తన ఫ్యామిలీతో కలిసి ఇక్కడికి వచ్చారు. కానీ, దురదృష్టవశాత్తూ ముగ్గురు బిడ్డలను కోల్పోయారు. 

తన భార్య, ఒక పిల్లోడు మాత్రమే ప్రాణాలతో బయపడినట్టు ప్రతినిధి చెప్పారు. ఉగ్రదాడులకు ముందు పొవెల్సన్ బిడ్డల్లో ఒకరు అల్మా తన సోదరులతో కలిసి దిగిన హాలీడే ట్రిప్ సెల్ఫీని షేర్ చేసింది. ఫోర్భ్స్ జాబితా ప్రకారం.. పొవెల్సన్ డెన్మార్క్ లో అత్యంత ధనవంతుల్లో ఒకరు. ఈయన ఆస్తి విలువ (7.9 బిలియన్లు (6.1బిలియన్లు డాలర్లు). చారిత్రక ఎస్టేట్స్ కొనుగోలు చేసిన ల్యాండ్ ఓనర్లలో పొవెల్సన్ అత్యంత ధనికుల జాబితాల్లో నిలిచారు.

పొవెల్సన్ భార్య అన్నె స్ట్రోమ్ పెడర్సన్ కు 2లక్షల ఎకరాల హైల్యాండ్ ఉన్నట్టు ఓ నివేదిక తెలిపింది. శ్రీలంకలో పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని ముష్కరులు లగ్జరీ హోటళ్లు, చర్చీల్లో వరుస బాంబు దాడులకు పాల్పడ్డారు. ఈస్టరన్ పండుగ సందర్భంగా ముష్కరులు జరిపిన మారణహోమంలో 290 మంది ప్రజలు మృత్యువాత పడగా, 500మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ వరుస బాంబు దాడుల్లో.. ఏడుగురు ఉగ్రవాదులు.. ఆత్మాహుతి దాడికి పాల్పడినట్టు సోమవారం ఓ విచారణ అధికారి తెలిపారు. 
 

Asos billionaire
Sri Lanka attacks
Anders Holch Povlsen

మరిన్ని వార్తలు