30 ఏళ్ల బాధకు విముక్తి : ఊపిరితిత్తుల్లో 25 పైసల నాణెం

Submitted on 16 March 2019
25 paise coin lungs | Kims Hospital Doctors Operation

ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న ఓ వృద్దుడి బాధకు వైద్యులు విముక్తి కల్పించారు. వృద్దుడి ఊపిరితిత్తులో ఉన్న 25 పైసల నాణేన్ని కుట్టు కోత లేకుండా తొలగించి అతడి ప్రాణాన్ని కాపాడారు డాక్టర్లు. ఈ ఆపరేషన్ కిమ్స్ ఐకాన్ వైద్యులు నిర్వహించారు. 

గాజువాకకు చెందిన ఎల్.సాయిబాబు (77) శ్వాసకోశ సమస్యలతో బాధ పడుతున్నారు. గాలి పీల్చుకోవడానికి అతనికి చాలా కష్టమయ్యేది. అంతేగాకుండా జ్వరంతో బాధపడుతుండే వాడు. ఎందుకో అర్థం కాలేదు. చివరకు కిమ్స్ ఆసుపత్రికి చేరుకున్నాడు. వృద్ధుడికి డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఊపిరితిత్తులను స్కానింగ్ తీయగా వైద్యులు షాక్ తిన్నారు. అందులో 25 పైసల నాణెం ఉన్నట్లు నిర్దారించారు. దీనిని సాయిబాబుకు తెలియచేశారు. 30 ఏళ్ల క్రితం నాణెంను మింగినట్లు గుర్తుకొచ్చింది. ఆపరేషన్ నిర్వహించి ఆ నాణెంను తొలగించాలని వైద్యులు డిసైడ్ అయ్యారు. ఆపరేషన్ నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. 

బ్రాంకోస్కోపీ ద్వారా పొడవైన ఫ్లెక్సిబుల్ ట్యూబ్‌కు కెమెరాను అమర్చి, ట్యూబ్‌ను ఊపిరితిత్తుల ద్వారా పంపించి నాణెంను తొలగించినట్లు పల్మనాలజిస్టు డాక్టర్ కె.ఎస్.ఫణీంద్ర కుమార్ వెల్లడించారు. సాయిబాబు కోలుకోవడంతో మార్చి 15వ తేదీ శుక్రవారం డిశ్చార్జ్ చేశామన్నారు.
 

25 paise
coin
lungs
Kims Hospital
Doctors
Operation
gajuwaka

మరిన్ని వార్తలు