6నెలల్లో 21వేల ఆర్డర్లు : అక్కడ.. అబార్షన్ పిల్స్‌కు భారీ గిరాకీ

Submitted on 22 May 2019
21 Thousand Women In US Ordered Abortion Pills Online In 6 Months

యూనైటెడ్ స్టేట్స్ లో గర్భ నిరోధక మాత్రల కోసం 21వేల మందికి పైగా మహిళలు ఆన్ లైన్ లో ఆర్డర్స్ చేశారట. కేవలం ఆరు నెలల్లోనే వేలాది మంది అబార్షన్ పిల్స్ కోసం ఆర్డర్ చేసినట్టు ఓ నివేదిక వెల్లడించింది. అక్టోబర్ 2018 నుంచి మార్చి 2019 మధ్యకాలంలో అబార్షన్ పిల్స్ ఆర్డర్లు భారీగా పెరిగినట్టు చారిటీ ఎయిడ్ యాక్సస్ రివీల్ చేసింది.

మెయిల్ నుంచి 55 శాతం వరకు ఆర్డర్లు : 
యూరోపియన్ ఆర్గనైజేషన్ చారిటీ అందించే ఆన్ లైన్ ప్రిస్ స్ర్కిప్షన్లు ఆధారంగా గర్భనిరోధక మాత్రలను మెయిల్ ద్వారా యూఎస్ కు పంపించినట్టు గార్డియన్ నివేదిక తెలిపింది. మెయిల్ ద్వారా 33 నుంచి 55 శాతం మంది మహిళలు అబార్షన్ పిల్స్ కోసం ఆర్డర్ చేస్తుంటారని ఎయిడ్ యాక్సస్ పేర్కొంది. అబార్షన్ పాలసీలకు విరుద్ధమైన రాష్ట్రాల్లో నివసించే మెజార్టీ మహిళలు ఎక్కువ ఉన్నారని తెలిపింది. 

స్థానికంగా మెడికల్ సర్వీసులు తగినంతగా లేనివారే ఆన్ లైన్ ద్వారా అబార్షన్ పిల్స్ కోసం ఆర్డర్ చేస్తున్నట్టు గుర్తించింది. అమెరికాలో నార్మల్ అబార్షన్ కు అనుమతి లేకపోవడం వల్లే వారంతా తమ అవాంఛిత గర్భాన్ని తీయించుకుంటున్నట్టు ఎయిడ్ యాక్సస్ వ్యవస్థాపకులు రెబిక్కా గంపర్ట్స్ చెప్పారు.

అబార్షన్ బ్యాన్ పై ఆందోళన :
యూఎస్ స్టేట్స్ లోని 50 రాష్ట్రాలన్నింటిలో అబార్షన్ లీగల్. కానీ, గతవారమే అల్బామా సహా నాలుగు రాష్ట్రాల్లో ఎర్లీ వీక్స్ అబార్షన్ బ్యాన్ చేశారు. దీంతో అక్కడి మహిళలంతా అబార్షన్ బ్యాన్ కు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. యూఎస్ అబార్షన్ రైట్స్ క్యాంపెయినర్లు, ప్రజాస్వామ్యవాదులంతా ర్యాలీగా చేపట్టారు. 

2006 నుంచి గంపెర్ట్స్ నెదర్లాండ్స్ ఆధారిత చారిటీ ఉమన్ వెబ్ పేరుతో నిర్వహిస్తున్నారు. ఏ దేశాల్లో అబార్షన్ బ్యాన్ చేశారో.. అక్కడి మహిళలు తమ అవాంఛిత గర్భాలను తొలగించుకునేందుకు ఆన్ లైన్ కన్సల్టేషన్స్ ద్వారా సంపద్రిస్తున్నారని ఆమె తెలిపారు. చారిటీలోని డాక్టర్లు.. రెండు పిల్స్ ను సూచిస్తుంటారు. ఈ పిల్స్ ద్వారా 10 వారాల్లో ప్రెగ్నెన్సీని తొలగించుకోవచ్చు. ఇండియా ఆధారిత ఓ ఫార్మసీ నుంచి మహిళలకు అబార్షన్ పిల్స్ పంపిస్తున్నట్టు గంపెర్ట్స్ వెల్లడించారు.  

21 Thousand Women
US
Abortion Pills
Online Order
charity Aid Access
abortion policies

మరిన్ని వార్తలు