కెమిస్ట్రీలో ముగ్గురికి నోబెల్

Submitted on 9 October 2019
2019 Nobel Prize

రసాయనశాస్త్రంలో విశేష కృషి చేసిన ముగ్గురికి ఈ ఏడాది నోబెల్ బహుమతి అభించింది. కెమిస్ట్రీ 2019లో నోబెల్ బహుమతి విజేతలను బుధవారం(అక్టోబర్-8,2019)ది రాయల్ స్వీడిష్ అకాడమీ సెక్రటరీ జనరల్ గోరన్ కే హాన్సన్ ప్రకటించారు. లిథియం-ఐయాన్ బ్యాటరీ డెవలప్ మెంట్ పై చేసిన పరిశోధనలకు అమెరికాకు చెందిన జాన్ బి గూడెనగ్,బ్రిటన్ కు చెందిన ఎమ్ స్టాన్లీ,జపాన్ కి చెందిన అకిరా యోషినోకి సంయుక్తంగా నోబెల్ బహుమతి లభించింది.

మొబైల్ ఫోన్‌ల నుండి ల్యాప్‌టాప్‌లు, ఎలక్ట్రిక్ వాహనాల వరకు ప్రతిదానిలో లిథియం-అయాన్ బ్యాటరీలను ఉపయోగిస్తారు. వారు మన జీవితాలను విప్లవాత్మకంగా మార్చారని నోబెల్ బహుమతి కోసం స్వీడిష్ అకాడమీ ట్వీట్ చేసింది.  ఈ సంవత్సరం కెమిస్ట్రీ గ్రహీతలు వారి పని ద్వారా, వైర్‌లెస్, శిలాజ ఇంధన రహిత సమాజానికి పునాది వేశారన ట్వీట్ లో తెలిపింది.

ఇప్పటివరకు మెడిసిన్,ఫిజిక్స్,కెమిస్ట్రీలో నోబెల్ బహుమతి విజేతలను ప్రకటించగా గురువారం (అక్టోబర్-10,2019) లిటరేచర్,శుక్రవారం (అక్టోబర్-11,2019) నోబెల్ శాంతి బహుమతి అందుకోనున్న వారి పేర్లను ప్రకటించనున్నారు. ఆల్ఫ్రైడ్ నోబెల్ జ్ణాపకార్థం సోమవారం (అక్టోబర్-14,2019) ఎకనామిక్ సైన్సెస్ లో ది స్విరిగ్స్ రిక్స్ బ్యాంక్ ప్రైజ్ ను ప్రకటించనున్నారు.

LITHIUM-ION
BATTERRIES
DEVELOPMEMNT
Chemistry
awarded
Nobel Prize
3SCIENTISTS

మరిన్ని వార్తలు