కోల్ కతాలో మళ్లీ చెలరేగిన అల్లర్లు : ఇద్దరు మృతి

Submitted on 20 June 2019
2 Killed In Clashes Near Kolkata, Mamata Banerjee Orders Urgent Meeting

పశ్చిమ బెంగాల్ లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఉత్తర కోల్ కతాలో జరిగిన అల్లర్లలో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. గురువారం జూన్ 20, 2019 నార్త్ కోల్ కతా భాట్పారాలో గుర్తు తెలియని వ్యక్తుల మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ ఘర్షణల్లో రాంబాబు షా అనే (17) పానీ పూరీ వ్యాపారి అక్కడిక్కడే మృతిచెందాడు.

తీవ్రంగా గాయపడ్డ రెండో వ్యక్తిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. గాయపడిన మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. కోల్ కతాలో హింసాత్మక ఘటనలపై రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ ఆదేశాలతో రాష్ట్ర పోలీసు ముఖ్య అధికారి, చీఫ్ సెక్రటరీతోపాటు ఇతర ఉన్నతాధికారులు అత్యవసరంగా సమావేశం అయ్యారు.

ఈ ఘర్షణల్లో గుర్తుతెలియని ముఠా సభ్యులు నాటు బాంబులు విసిరారు. తుపాకీ కాల్పులు జరిపారు. అప్రమత్తమైన పోలీసులు వారిపై టియర్ గ్యాస్ షెల్స్‌ను ప్రయోగించారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని స్థానిక పోలీస్ స్టేషన్ కొత్త భవనాన్ని ప్రారంభించటానికి బెంగాల్ పోలీసు చీఫ్ రావడానికి కొన్ని గంటల ముందు ఈ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. 
 
భట్పారా పోలీస్ స్టేషన్ కొత్త భవనాన్ని ప్రారంభించడానికి డీజీపీ రావడానికి గంట ముందు ఒక్కసారిగా నాటు బాంబు పేలుళ్లు జరిగాయి. డీజీపీ కాన్వాయ్ తిరిగి కోల్‌కతాకు బయల్దేరింది. కొత్త పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవం నిలిచిపోయింది. ఈ ప్రాంతంలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బందితో పాటు పోలీసు అధికారుల బృందాన్ని మోహరించారు. షాపులు, మార్కెట్లు, వ్యాపార సంస్థల షెట్టర్లను మూసివేయించారు.

2 Killed
Clashes
Kolkata
Mamata Banerjee
Orders
Urgent Meeting

మరిన్ని వార్తలు