ఫస్ట్ వీకెండ్ కాంచన-3 కుమ్మేసిందిగా!

Submitted on 22 April 2019
1st Weekend Kanchana 3 Collections Across Telugu States-10TV

ఫేమస్ కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ రాఘవ లారెన్స్ నటిస్తూ, డైరెక్ట్ చేసిన మూవీ కాంచన-3.. ముని సిరీస్‌లో నాలుగవ సినిమాగా రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 19 న తమిళ్, తెలుగులో గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. బి, సీ సెంటర్స్‌లో బ్రహ్మాండమైన కలెక్షన్స్ రాబడుతూ, నాని జెర్సీ సినిమాకి గట్టిపోటీ ఇస్తుంది కాంచన-3.. ఫస్ట్ వీకెండ్‌లో బాక్సాఫీస్ దగ్గర ఒక డబ్బింగ్ సినిమా ఇంతలా సత్తాచాటడం విశేషం.. రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంచన-3 మొదటి మూడురోజుల కలెక్షన్స్ ఏరీయాల వారీగా ఇలా ఉన్నాయి.

నైజాం : రూ. 3.05 కోట్లు, సీడెడ్ : రూ. 2.05 కోట్లు, ఈస్ట్ : రూ. 0. 75 కోట్లు, వెస్ట్ : రూ.0.51 కోట్లు, కృష్ణా : రూ. 69.23 కోట్లు, గుంటూరు : రూ. 0.85 కోట్లు, నెల్లూరు : రూ. 32.06 కోట్లు, ఉత్తరాంధ్ర : రూ.96.04 కోట్లు.. టోటల్ షేర్ : రూ. 9.18 కోట్లు.. కృష్ణా జిల్లాలో చిత్రలహరి 10 రోజులకు గానూ, రూ. 74.99 కోట్ల షేర్ రాబడితే, కాంచన-3 కేవలం మూడు రోజుల్లో, రూ. 4 లక్షల తేడాతో.. రూ. 69.20 కోట్ల షేర్ రాబట్టడం విశేషం. మిక్సెడ్ టాక్ వచ్చినా కూడా భారీ స్థాయిలో వసూళ్ళు రాబడుతూ ట్రేడ్ పండితులను ఆశ్యర్యపరుస్తుంది కాంచన-3.

వాచ్ ట్రైలర్.. 

    

Raghava Lawrence
Oviya
Vedika
Niki Tamboli
Thaman SS

మరిన్ని వార్తలు