అసలు కారణం ఇదే : ప్రియుడిపై యాసిడ్ పోసిన యువతి.. అరెస్ట్

Submitted on 17 June 2019
19-Year-Old Delhi Girl Arrested For Throwing Acid On Her Boyfriend To Prevent Break Up

ప్రేమించుకున్నారు.. మూడేళ్లు కలిసి తిరిగారు. చివరికి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ, కొన్నినెలల నుంచి ప్రియుడు పెద్దగా పట్టించుకోవడం లేదు. కారణం అడిగితే చెప్పడం లేదు. గట్టిగా అడిగితే బ్రేకప్ అంటున్నాడు. ప్రియురాలికి అనుమానం వచ్చింది. తనను కాదని మరో యువతితో సంబంధం పెట్టుకున్నాడేమోనని భావించింది. ప్రియుడి ముఖం అందంగా ఉంటే.. ఏ అమ్మాయి అతన్ని ఇష్టపడదు.. చచ్చినట్టు తననే పెళ్లి చేసుకుంటాడని భావించింది. స్కెచ్ గీసింది. యాసిడ్ బాటిల్ కొని బ్యాగులో పెట్టుకుంది.

ఇద్దరు కలిసి బైక్ మీద బయల్దేరారు. మధ్యలో బైక్ ఆపింది. హెల్మట్ తీసేయమని చెప్పింది. తనకు అసౌకర్యంగా ఉందని నమ్మించింది. దీంతో 24ఏళ్ల యువకుడు హెల్మట్ తీసి డ్రైవ్ చేస్తున్నాడు. ఇదే సరైన సమయంగా భావించి ప్రియుడి ముఖంపై యాసిడ్ పోసింది. ఎవరో తమపై యాసిడ్ పోసారని కథ అల్లింది. అనుమానం రాకుండా తనపై కూడా యాసిడ్ పడినట్టు కథ రక్తి కట్టించింది.

యాసిడ్ దాడిలో ప్రియుడు ముఖంలో ఒకవైపు 15శాతం వరకు కాలిన గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందిన బాధితుడు డిశ్చార్జీ కూడా అయ్యాడు. యాసిడ్ దాడి ఘటనపై పోలీసులు విచారించగా షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. ప్రియుడిపై యాసిడ్ దాడి చేసింది ప్రియురాలే అని తెలిసి పోలీసులు షాక్ అయ్యారు.

దీంతో 19ఏళ్ల యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఢిల్లీలోని వికాస్ పూరి ప్రాంతంలో జరిగింది. విచారణలో భాగంగా పోలీసులు యాసిడ్ దాడి ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీ ఫుటేజీలను పరిశీలించారు. కానీ, యాసిడ్ దాడి జరిగిన ఆనవాళ్లు ఎక్కడా రికార్డు కాలేదు. యాసిడ్ బాటిల్ పై ఉన్న సమాచారం ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. యాసిడ్ కొన్న షాపు దగ్గరకు వెళ్లి ఆరా తీశారు.

యాసిడ్ కొనింది ఢిల్లీ యువతి అని తెలిసి పోలీసులు తొలుత షాక్ అయ్యారు. యాసిడ్ దాడిపై యువతిని ప్రశ్నించగా.. తనకు ఏ పాపం తెలియనది మాట దాటవేసే ప్రయత్నం చేసింది. పోలీసులుకు ఆమెపై ఇంకా అనుమానం ఎక్కువైంది. తమదైన శైలీలో పోలీసులు యువతిని ప్రశ్నించడంతో అసలు కథ బయట పెట్టేసింది. తానే యాసిడ్ పోసినట్టు విచారణలో అంగీకరించింది. కేసు నమోదు చేసిన పోలీసులు యువతిని అదుపులోకి తీసుకున్నారు. 

Delhi Girl Arrest
Throwing Acid
Boyfriend
Prevent Break Up


మరిన్ని వార్తలు