బాలయ్య రికార్డుల వేటకి 18 ఏళ్ళు

Submitted on 11 January 2019
18 Years of Balakrishna Narasimha Naidu -10TV

యువరత్న నందమూరి బాలకృష్ణ, బి.గోపాల్ కాంబినేషన్‌లో, రాయలసీమ బ్యాక్ డ్రాప్‌లో రూపొంది, తెలుగు చలనచిత్ర పరిశ్రమ రికార్డులన్నిటినీ తిరగరాసిన సినిమా, నరసింహనాయుడు.. బాలయ్యకి సూపర్ జోడీగా పేరుతెచ్చుకున్న సిమ్రన్, ఆశాషైనీ, ప్రీతి జింగానియా హీరోయిన్స్‌గా నటించగా, మేడికొండ వెంకట మురళీకృష్ణ నిర్మించిన నరసింహనాయుడు 2001 జనవరి 11న సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి, రికార్డు స్థాయి కలెక్షన్లతో బాక్సాఫీస్ దుమ్ము దులిపింది. దాదాపు రూ.20 కోట్ల షేర్ తెచ్చిందీ సినిమా.. డైరెక్ట్‌గా నాలుగు ఆటలతో, 100 సెంటర్లలో, 100 రోజులాడి చరిత్ర సృష్టించాడు నరసింహనాయుడు..

పరుచూరి బ్రదర్స్ కథ, మాటలు, బి.గోపాల్ టేకింగ్, మణిశర్మ మ్యూజిక్ సినిమాకి ప్లస్ అయ్యాయి. బాలయ్య నట విజృంభణ ఈ సినిమాలో చూడొచ్చు.. కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా అనే పవర్ ఫుల్ డైలాగ్ బాలయ్య చెప్తే, థియేటర్స్ దద్దరిల్లి పోయాయి. డ్యాన్స్ మాస్టర్‌గా, నరసింహనాయుడుగా రెండు షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్‌లో బాలయ్య నటవిశ్వరూపం చూపించాడు. ఈ సినిమాకి గానూ ఉత్తమ నటుడిగా తొలి నంది అవార్డు అందుకున్నాడు బాలయ్య. 50 డేస్, 100 డేస్, 150 అండ్ 200 డేస్ రికార్డ్ స్థాయి సెంటర్స్‌లో ఆడడం విశేషం. 2001 జనవరి 11న రిలీజ్ అయిన నరసింహనాయుడు, 2019 జనవరి 11తో 18 ఏళ్లు పూర్తి చేసుకుంది.

వాచ్ నిన్నాకుట్టేసినాది సాంగ్... 

Nandamuri Balakrishna
18 Years of Narasimha Naidu

మరిన్ని వార్తలు