వణికిపోయిన ఊరిజనం : ఆ ఇంటిపై 18 అడుగుల కొండచిలువ

Submitted on 22 April 2019
18-feet python slithers on garage roof, stuns people in locality, Facebook Live Video Viral

అప్పటివరకూ ప్రశాంతంగా ఉన్న ఆ ఊరి జనం గుండెల్లో ఒక్కసారిగా అలజడి మొదలైంది. ఓ భారీ కొండచిలువ సడన్ గా ప్రత్యక్షమైంది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదుగానీ.. జనాన్ని మింగేయడానికి వస్తున్నట్టు మెల్లగా పాకుతూ వస్తోంది. ఓ ఇంటికప్పుపై నుంచి మెల్లగా జారుతోంది. అది చూసిన గ్రామవాసులంతా భయంతో పరుగులు తీశారు. 5 కాదు.. 10 కాదు.. ఏకంగా 18 అడుగుల పొడవు ఉంది కొండచిలువ. చూస్తూనే ప్రాణం పోయేలా ఉంది.

ఈ ఘటన మిచిగాన్ లోని డెట్రాయిడ్ ప్రాంతంలో వెలుగుచూసింది. ఈ కొండచిలువ పేరు.. జులియెట్. వీధి కుక్కల నుంచి తప్పించుకునేందుకు ప్రాణభయంతో ఈ భారీ కొండచిలువ మెల్లగా ఇంటికప్పుపైకి ఎక్కేసింది. అలా మెల్లగా ఇంటిపై నుంచి జారుతోంది. అనుకోని అతిథిగా ఇంటిపై కనిపించిన భారీ కొండచిలువను చూసి అక్కడి వారంతా హడలిచచ్చారు. 

18 అడుగుల భారీ కొండచిలువను చూసేందుకు వందలాది మంది జనం అక్కడికి తరలివచ్చారు. ఈ క్రమంలో ఒక మహిళ తన ఫేస్ బుక్ అకౌంట్ నుంచి కొండచిలువ ఇంటిపైన పాకుతుండగా.. లైవ్ రికార్డు చేసింది. అంతేకాదు.. ఓ మై గాడ్.. ఎంత పెద్దగా ఉందో అంటూ ఫేస్ బుక్ లో క్యాప్షన్ పెట్టింది. 13 నిమిషాల పాటు నిడివి ఉన్న ఈ వీడియోలో వీధుల్లో జనమంతా దూరంగా నిలబడి కొండచిలువను చూస్తుండిపోయారు.

అదే సమయంలో ఒక యువకుడు ధైర్యసాహసాన్ని ప్రదర్శించాడు. ఇంటి గ్యారేజీపై ఉన్న కొండచిలువను పట్టుకున్నాడు. భారీ కొండచిలువను తన భుజాలపై మోసుకుంటూ కిందకు దిగడం వీడియోలో చూడవచ్చు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

18-feet python
garage roof
 Latonda Harvey
Detroit
garage  

మరిన్ని వార్తలు