రికార్డ్ స్థాయిలో 17వ లోక్ స‌భ‌కు ఎన్నికైన మ‌హిళ‌లు

Submitted on 24 May 2019
17th Lok Sabha Elects Most Women MPs Ever

17వ లోక్‌ సభకు రికార్డు స్థాయిలో మహిళలు ఎన్నికయ్యారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 724 మంది మహిళలు పోటీ చేయగా 78 మంది విజయం సాధించారు.వీరిలో 27 మంది సిట్టింగ్ ఎంపీలు ఉన్నారు.ఈ 78లో ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ర్టాల నుంచి 11 మంది చొప్పున ఉన్నారు. అంతేకాకుండా గెలిచిన 78 మందిలో ప్ర‌ధాన జాతీయ పార్టీలైన బీజేపీ నుంచి 41మంది,కాంగ్రెస్ నుంచి 9మంది విజ‌యం సాధించారు.

ఊహించ‌ని విధంగా ఈ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ఎన్న‌డూ లేని విధంగా 41శాతం మ‌హిళా అభ్య‌ర్థుల‌ను బ‌రిలోకి దించింది.1952నుంచి 2014 ఎన్నికల వరకు ఈ స్థాయిలో మహిళలు లోక్‌ సభకు ఎన్నిక కాలేదు. 2009 ఎన్నికల్లో 52 మంది మహిళలు, 2014 ఎన్నికల్లో 64 మంది లోక్‌ సభకు ఎన్నికయ్యారు.

17th Lok Sabha
Elects
Most Women
MP
ever
Congress
BJP
record

మరిన్ని వార్తలు