రాష్ట్రపతికి రాజీనామా సమర్పించిన మోడీ

Submitted on 24 May 2019
16th Lok Sabha dissolution

భారత ప్రధాని నరేంద్ర మోడీ తన పదవికి రాజీనామా చేశారు. మే 24వ తేదీ శుక్రవారం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించారు. దానిని ఆయన ఆమోదించారు. కొత్త మంత్రివర్గం ఏర్పాటయ్యే వరకూ ప్రధాని మోడీని పదవిలో కొనసాగాల్సిందిగా కోరారు. లోక్‌సభలో మంత్రులుగా ఉన్న వారందరికీ రాష్ట్రపతి విందు ఏర్పాటు చేసారు. ఆ కార్యక్రమం తర్వాత బిజెపి పార్లమెంటరీ పార్టీ భేటీ అయింది. కేబినెట్ రద్దు చేయాలని కేంద్ర కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. 

ఇక ప్రధానిగా రెండోసారి మోడీ ప్రమాణస్వీకారంపై మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది.ముందుగా మే 26నే పదవీ ప్రమాణస్వీకారం ఉంటుందని భావించినా..అది మరి కాస్త వాయిదా పడేలా కన్పిస్తోంది. జూలై మూడో తేదీతో 16వ లోక్ సభ పదవీ కాలం ముగియనుంది. ఆ లోపే కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావాల్సి ఉంటుంది.

గతంలో ప్రధానిగా మోడీ మే 26 వ తేదీన బాధ్యతలు స్వీకరించారు. ఈసారి కూడా మే 26నే తేదీనే బాధ్యతలు స్వీకరించాలని అనుకున్నా కొన్ని కారణాలు, జాతక కారణాల రీత్యా మే 30వ తేదీన మోడీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

వీటితో పాటు కేబినెట్‌లో ఎవరెవరిని తీసుకోవాలి ? ఏ సామాజిక అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కూడా ప్రధాని చర్చించినట్లు సమాచారం. గత కేబినెట్‌లో కేబినెట్ హోదా కంటే స్వతంత్ర హోదా కలిగిన మంత్రులే ఎక్కువగా ఉండేవారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 303 స్థానాల్లో ఘన విజయం సాధించింది. కాంగ్రెస్‌కు కేవలం 52 సీట్లు మాత్రమే వచ్చాయి. 

16th Lok Sabha
dissolution
Election 2019
Modi

మరిన్ని వార్తలు