రామ్ ఎనర్జీకి 13ఏళ్ళు

Submitted on 11 January 2019
13 Years for Ram Pothineni in TFI -10TV

ఎనర్జి‌టిక్ స్టార్ రామ్ హీరోగా కెరీర్ స్టార్ట్ చేసి, విజయవంతంగా 13ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. 2006వ సంవత్సరంలో, దర్శక నిర్మాత వై.వి.ఎస్.చౌదరి, దేవదాస్ మూవీతో రామ్‌ని హీరోగా లాంచ్ చేసాడు. 2006 జనవరి 11న రామ్ హీరోగా పరిచయం అయిన దేవదాస్ మూవీ రిలీజ్ అయ్యి, సూపర్ హిట్ అయ్యింది. రామ్‌కి రెండవ సినిమా జగడం ఊహించని షాక్ ఇచ్చినా, రెఢీతో మరో హిట్ అందుకున్నాడు. మస్కా, కందిరీగ, నేను శైలజ వంటి సినిమాలతో, ఆడియన్స్‌ని ఆకట్టుకున్నాడు. తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలొయింగ్‌ని పెంచుకోగలిగాడు.

కెరీర్‌లో ఒడిదుడుకులనేవి ఎవరికైనా సహజం.. కానీ, ఎప్పటికప్పుడు ఒక అంచనా ప్రకారం, కొత్తదనం కోరుకునే ఆడియన్స్ ఆలోచనల ప్రకారం ముందుకు వెళ్తూ, మంచి సినిమాలు తియ్యడం అనేది అందరికీ సాధ్యం కాదు. దీన్ని ఆచరణలో చూపాడు రామ్ పోతినేని.. ప్రస్తుతం డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో ఇస్మార్ట్ శంకర్ అనే సినిమా చేస్తున్న రామ్, పూరీ సినిమాతో తిరిగి ట్రాక్‌లోకి వస్తానని కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు.

వాచ్ దేవదాసు సాంగ్...

Energtic Star Ram
13 Years for Ram Pothineni in TFI

మరిన్ని వార్తలు