ఆల్ ద బెస్ట్ : 10వ తరగతి పరీక్షలు ప్రారంభం

Submitted on 15 March 2019
10th Class exams from to March 16

హైదరాబాద్‌: రాష్ట్రంలో మార్చి 16 నుంచి ఏప్రిల్ 3 వరకు జరగనున్న టెన్త్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం పూర్తి చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 11వేల 023 ప్రభుత్వ.. ప్రైవేట్ స్కూల్స్ కు చెందిన మొత్తం 5లక్షల 52వేల 302 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వారిలో 5లక్షల 07వేల 810 మంది రెగ్యులర్‌ స్టూడెంట్స్ ఉన్నారు. 44వేల 492 మంది ప్రైవేట్ స్టూడెంట్స్ ఎగ్జామ్ కు హాజరవుతున్నారు. రెగ్యులర్‌ స్టూడెంట్స్ లో  2లక్షల 55వేల 318 మంది బాలురు, 2లక్షల 52వేల 492 మంది బాలికలు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 2వేల 563 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.
Read Also: సోదరుడే చంపేశాడు: చనిపోయిన మహిళ తిరిగొచ్చింది

పరీక్షలు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:15 గంటలకు వరకు జరుగుతుంది. స్టూడెంట్స్ ఎగ్జామ్ టైమ్ స్టాటింగ్ అంటే ఉదయం 9:30 గంటల కంటే 45 నిమిషాల ముందే సెంటర్స్ లోకి అనుమతించనున్నారు. ఆ తర్వాత వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. 

కాంపొజిట్‌ కోర్సు పేపర్‌–1, పేపర్‌–2, ద్వితీయ భాష, ఓఎస్సెస్సీ మెయిన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌–1, పేపర్‌–2 పరీక్షలు మాత్రం ఉదయం 9:30 గంటల నుంచి మధాహ్నం 12:45 గంటల వరకు జగరనుంది. SSC కాంపొజిట్‌ పేపర్‌–2 పరీక్ష ఉదయం 9:30 గంటల నుంచి 10:45 గంటల వరకు, వొకేషనల్‌ థియరీ పరీక్ష ఉదయం 9:30 గంటల నుంచి 11:30 గంటల వరకు ఉంటుంది.

ఇప్పటికే విద్యార్థులకు హాల్‌ టికెట్ల పంపిణీ పూర్తయ్యింది. అందని వారు లేదా పొగొట్టుకున్న వారు వెబ్‌సైట్‌ (https://www. bsetelangana.org/) నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. డౌన్ లోడ్ హాల్ టికెట్లు కూడా పరీక్షలకు అనుమతిస్తారు. ఇతర ఇబ్బందులు, అనుమానాలు, సందేహాలు ఉంటే  24 గంటలు పని చేసేలా ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూంకు 040–23230942 ఫోన్‌ చేసి నివృత్తి చేసుకోవచ్చు.
Read Also: వివేకా హత్య : ఆరోపణలు రుజువైతే నడిరోడ్డు పై కాల్చేయండి

10th Class
Exams
March 16
to begin April 3
Endig
Telangana

మరిన్ని వార్తలు