ఖాయిలా పరిశ్రమల వైద్యుడు మోటపర్తి..

17:18 - December 2, 2016

పశ్చిమగోదావరి : సాధించాలన్న తపన, కష్టపడేతత్వం.. వెరసి పారిశ్రామిక, వ్యాపార రంగాల్లో అద్భుతాలు సృష్టిస్తున్నారయన. ఒక వైపు రంగాలను విస్తరిస్తూనే, మరోవైపు సంపాదించిన సొమ్ములో కొంత శాతం సమాజక సేవా కార్యక్రమలకూ ఖర్చు చేస్తున్నారు. తెలుగు జాతి ఖ్యాతిని ఖండాంతరాల్లో చాటిచెబుతున్నారు ప్రసాదిత్య గ్రూపు సంస్థ అధిపతి మోటపర్తి శివరామ ప్రసాద్‌ ....

మోటపర్తిని వరించిన పలు అవార్డులు
మనసుంటే మార్గం ఉంటుంది. కష్టపడేతత్వ అన్ని రంగాల్లో విజయం సాధ్యమవుతుందని నిరూపించారు ప్రసాదిత్య గ్రూపు సంస్థల అధిపతి మోటపర్తి శివరామ ప్రసాద్‌. మూతపడిన పరిశ్రమలను సొంతం చేసుకుని, లాభాలబాట పట్టించి విజయవంతమైన పారిశ్రామికవేత్తగా గుర్తింపు పొందారు. పారిశ్రామిక, వ్యాపార రంగాలను బహుముఖంగా విస్తరించి అందరి మన్ననలు అందుకుంటున్నారు. అవార్డులు సొంతం చేసుకుంటున్నారు.

1985లో పటాన్‌చెరులో మార్టో పెరల్‌ అల్లాయ్స్‌ కొనుగోలు
పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ప్రసాద్‌... 1971లో వరంగల్‌ ఆర్‌ఈసీ నుంచి ఇంజినీరింగ్‌ డిగ్రీ పొందారు. 1985లో మెదక్‌ జిల్లా పటాన్‌చెరులో రాష్ట్ర ఆర్థిక సంస్థ సహకారంతో మూతపడిన మార్టో పెరల్‌ అల్లాయ్స్‌ పరిశ్రమను కొనుగోలు చేయడం ద్వారా పారిశ్రామికరంగంలో అడుగు పెట్టారు. ఆ తర్వాత పటాన్‌చెరులోనే మూతపడిన డంకన్‌ అల్లాయ్స్‌ కంపెనీని సొంతం చేసుకుని లాభాట బాట పట్టించారు. హైదరాబాద్‌, అమెరికాలో పరిశ్రమలు స్థాపించిన మోటపర్తి శివరామ ప్రసాద్‌ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో తన పారిశ్రామిక సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు ప్రణాళికులు రూపొందిస్తున్నారు.

పశ్చిమ గోదావరి జిల్లాలో కోకో పంట సాగు
ఏపీలో కోకో ఆధారంగా ఆహార శుద్ధి పరిశ్రమలు ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో కోకో పంట సాగువుతోంది. ఆఫిక్రాలో ఈ రంగంలో పరిశ్రమలు నిర్వహిస్తున్న శివరామ ప్రస్తాద్‌.. ఆ టెక్నాలజీని ఇక్కడికి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అలాగే ఆటోమొబైల్‌ రంగంలోనూ విస్తరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

టోలో వెస్ట్‌ ఆఫ్రిపక్‌ సిమెంట్‌ ఎస్‌ఏ వాసెమ్‌ కొనుగోలు
1991లో ఘనాలో టెమా స్టీల్‌ కంపెనీ కొనుగోలు చేయడం ద్వారా ప్రసాదిత్య గ్రూపు ఆఫ్రికా మార్కెట్‌లో అడుగు పెట్టింది. ఆ తర్వాత టోగోలోని వెస్ట్‌ ఆఫ్రికన్‌ సిమెంట్‌ ఎస్‌ఏ వాసెమ్‌ను కొనుగోలు చేసింది. ఆ తర్వాత మరిన్ని దేశాలకు విస్తరించింది. ఆటోమొబైల్స్‌, ఐటీ, రసాయనాలు, వినోదం, మౌలికసదుపాయాలు... ఇలా బహుముఖ రంగాల్లో విజయం సొంతం చేసుకుంది.

భారత పరిశ్రమలు, వాణిజ్య మండళ్ల సమాఖ్య.. అసోచామ్‌ అవార్డు
విజయవంతమైన పారిశ్రామికవేత్తగా మోటపర్తి శివరామ ప్రసాద్‌ పలు అవార్డులు అందుకున్నారు. భారత పరిశ్రమలు, వాణిజ్య మండళ్ల సమాఖ్య.. అసోచామ్‌ నుంచి ప్రసాదిత్య గ్రూపు రెండు ప్రతిష్ఠాత్మక అవార్డులు అందుకుంది.ప్రసాదిత్య గ్రూపు ప్రత్యక్షంగా, పరోక్షంగా పది వేల మందికి ఉపాధి కల్పిస్తోంది. నినూత్న ఆలోచనలు, నిరంతర సాధనతో విజయవంతమైన పారిశ్రామివేత్తగా గుర్తింపు పొందిన మోటపర్తి శివరామ ప్రసాద్‌ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.

Don't Miss