'ఏది ముందు?ఏది వెనుక?' బిగ్ డిబేట్..

21:21 - December 3, 2016

దేశ వ్యాప్తంగా 5లక్షల గ్రామాల్లో ఏటీఎం లు లేవు..80కోట్ల ప్రజలకు బ్యాంక్ ఎకౌంట్స్ లేవు..దేశంలో 6కోట్ల మందికి మాత్రమే నగదు రహిత లావాదేవీలపై అవగాహన వుంది. 40 శాతం మంది ప్రజలకు నిరక్ష్యరాస్యులు..అందని ఆన్ లైన్ పై సర్కార్ ఆరాటపడుతోంది...అవస్థల పాలవుతున్న ప్రజానీకం.. పాత పెద్ద నోట్ల రద్దు..కొత్త నోట్ల కొరతతో దేశవ్యాప్తంగా సామాన్యుడు తీవ్ర సంక్షోభంలో పడిపోయాడు. ఈ ఇబ్బందులు రోజురోజుకూ కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో నగదు రహిత లావాదేవీలపై ప్రజలు దృష్టిపెట్టాలంటూ అటు కేంద్రం ప్రభుత్వం..ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు పేర్కొంటున్నాయి. స్వైపింగ్ మిషన్లు లేవు..డెబిట్ కార్డుల్లేవు..స్మార్ట్ ఫోన్ల వాడకం పెద్దగా లేని భారత్ లో క్యాష్ లెస్ లావాదేవీలు ఎంతవరకూ సాధ్యమేనా ? ఈ నేపథ్యంలో టెన్ టీవీ 'ఏది ముందు? ఏది వెనుక?'అనే శీర్షికతో బిగ్ డిబేట్ ను చేపట్టింది. ఈ చర్చలో హరగోపాల్ (సామాజిక రాజకీయ విశ్లేషకులు),సజ్జా ప్రసాద్ (విశ్లేషకులు),సుధాకర్ (టీఆర్ఎస్ చీఫ్ విప్),రామకృష్ణ (ప్రముఖ విశ్లేషకులు),రాంబాబు (అఖిల భారత బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జాతీయ కార్యదర్శి),రవి కుమార్ (సామాజిక విశ్లేషకులు), మైసూరారెడ్డి (సీనియర్ రాజకీయ నేత,మాజీ మంత్రి,ప్రస్తుత వైసీపీ నేత)ప్రభాకర్ (బీజేపీ నేత) పాల్గొన్నారు. చర్చలో పాల్గొన్న విశ్లేషకులు సజ్జా ప్రసాద్ మాట్లాడుతూ నోట్ల రద్దు అనంతరం కోట్లాదిమంది ప్రజలు బ్యాంకులు..ఏటీఎంల చుట్టూ తిరుగుతూ దేశ ప్రజానీకం రోడ్డుమీద పడిపోయిందన్నారు. ఆర్థిక మూలాలు..ఆర్బీఐ అటానమీ దెబ్బతిన్నాయన్నాయన్నారు. ప్రజలకు బ్యాంకులపై వున్న నమ్మకం పోతోందని తెలిపారు. ఈనేపథ్యంలో క్యాష్ లెస్ సొసైటీ..డిజిటల్ మౌలిక వసతులు లేకుండా భారత్ లో సాధ్యమవుతుందని ప్రశ్నించారు. అలాగే చర్చలో పాల్గొన్న ప్రముఖులు, విశ్లేషకులు ఎటువంటి అభిప్రాయాన్ని వెల్లడించారో తెలసుకునేందుకు ఈ వీడియో చూడండి.. 

Don't Miss