1 మిలియన్ ఫ్రైజ్ : ఈ కారును హ్యాక్ చేయగలరా?

Submitted on 16 January 2019
$1 million on offer for anyone who can hack this car

హ్యాకర్లకు గుడ్ న్యూస్. హ్యాకర్లను ప్రోత్సహించే దిశగా టెస్లా కంపెనీ ప్రత్యేక హ్యాకింగ్ కాంపిటీషన్ నిర్వహిస్తోంది. ఈ కాంపిటీషన్ లో భాగంగా టెస్లా కంపెనీ హ్యాకర్లకు ఓ పెద్ద సవాల్ విసిరింది. హ్యాకింగ్ పోటీలో గెలుపొందినవారికి 1 మిలియన్ ఆఫర్ ఫ్రైజ్ ప్రకటించింది. ఈ ఆఫర్ లో దాదాపు (రూ. 7.10 కోట్లు) వరకు బహుమతులు గెలుచుకోవచ్చు. ఇంతకీ, హ్యాకర్లకు విసిరిన సవాల్ ఏంటో తెలుసా? ఇటీవల టెస్లా భాగస్వామ్య పీడబ్య్లూ2 ఓన్ సెక్యూరిటీ కంపెనీ టెస్లా -3 అనే ఎలక్ట్రానిక్ కారును తయారుచేసింది. అత్యంత భద్రత కలిగిన ఈ కారులోని సెక్యూరిటీ వ్యవస్థలో సమస్యలను (బగ్) గుర్తించాలని హ్యాకర్లకు సవాల్ విసిరింది. టెస్లా మోడల్ 3 కారు సాఫ్ట్ వేర్ భద్రత వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉందో తెలుసుకునేందుకు ఈ హ్యాకింగ్ పోటీని నిర్వహిస్తోంది.

ఎవరు ముందు గెలిస్తే.. వారికే ‘టెస్లా 3’ కారు సొంతం
ఈ పోటీలో గెలుపొందిన హ్యాకర్లు 35వేల డాలర్లు నుంచి 2,50 వేల డాలర్ల వరకు ఫ్రైజ్ గెలుచుకోవచ్చు. ముందుగా ఏ హ్యాకర్ అయితే బగ్ ను గుర్తిస్తాడో అతడు ఫ్రైజ్ మనీతో పాటు టెస్లా 3 మోడల్ కారు సొంతం చేసుకోవచ్చు. 2007 నుంచి పీడబ్ల్యూ2 ఓన్ సంస్థ సాఫ్ట్ వేర్ భద్రత వ్యవస్థపై హ్యాకర్లకు పోటీలు నిర్వహిస్తోందని క్యూబర్ సెక్యూరిటీ సంస్థ ట్రెండ్ మైక్రో సీనియర్ డైరెక్టర్ వాల్యునర్ బిలిటీ రీసెర్చ్ బ్రేయిన్ గోరెంక్ తెలిపారు. ఇప్పటివరకూ తమ సంస్థ నిర్వహించిన హ్యాకర్ల పోటీల్లో గెలుపొందినవారి పేర్లను కూడా టెస్లా వెబ్ సైట్ లో పొందుపరిచినట్టు తెలిపారు. 2013లో 18 మంది హ్యాకర్లు గెలవగా, 2014లో ఏడుగురు, 2016లో ఇద్దరు మాత్రమే కనిపెట్టారు. గత రెండేళ్ల కాలంలో ఇద్దరు మాత్రమే టెస్లా నుంచి ఫ్రైజ్ మనీ గెలుచుకున్నారు.  

Hack
Car
Tesla model 3 car
PW2Own
Hackers competition
Hackers
Prize money

మరిన్ని వార్తలు