అత్యంత దారుణం'గజరాజు'ల ఊచకోత..!!

20:49 - September 4, 2018

ఢిల్లీ : గజరాజుల్ని చూస్తే చిన్న పిల్లల నుండి పెద్దవారు కూడా ఆనంద పడుతుంటారు. ఏనుగును చూస్తే ఏడ్చే పిల్లలు కూడా కిలకిలా నవ్వేస్తారు. పెద్ద ఆకారం, చిన్ని చిన్ని కళ్లు, పెద్ద పెద్ద చెవులు ఇలా గజరాజులో అన్ని ప్రత్యేకతలే. ఏనుగు ఏనుగు నల్లన ఏనుగు కొమ్ములు తెల్లన అంటు పాటలు పాడుకుంటు గజరాజులను చూసి, విని, పాడుకుంటు మురిసిపోతాం. కానీ ఇక్కడ గజరాజులను దుర్భర పరిస్థితి ఎంతటి కఠినాత్ములలైనా కన్నీరు పెట్టకమానరు. ఎక్కడ ఏనుగులను చూసినా అదే దృశ్యం మన కళ్ల ముందు నిలిచి మనసు ద్రవింపజేస్తుంది. అంతటి దుర్భరమైన, భయంకరమైన, దారుణమైన ఘటన ఆఫ్రికా వన్యమృగ చరిత్రలోనే అత్యంత దుర్భరమైన వార్త ఇది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఆఫ్రికాలోని బొచ్వానాలో ఏకంగా వంద ఏనుగులు ఊచకోతకు గురయ్యాయి. వాటి దంతాల కోసమే ముష్కరులు ఈ ఘోరకలికి ఒడిగట్టారు. ఆకాశమార్గాన జరిపిన సర్వేలో ఏనుగుల కళేబరాలు అడవిలో అక్కడక్కడా చెల్లాచెదురుగా పడిఉండడం కనిపించింది. షాక్ అయిన అటవీ అధికారులు రంగంలోకి దిగారు. సుమారు వంద ఏనుగులు విగతజీవులై వారి కంటికి కనిపించాయి.

జూలై 10వ తేదీనుంచి ఈ అన్వేషణ...ప్రతిరోజూ కొనసాగుతునే వుంది. ఇంకా గజరాజుల కళేబరాలు అటవీశాఖ అధికారులకు కనిపిస్తు మమ్మల్ని విస్మయానికి, ఆందోళనలకు గురిచేస్తున్నాయని వన్యప్రాణి సంరక్షణ సంస్థ ఎలిఫెంట్స్ వితౌట్ బార్డర్స్ డైరెక్టర్ మైక్ చేజ్ ఆవేదనతో తెలిపారు.

ఇప్పటి వరకూ ఆఫ్రికా చరిత్రలో ఇంతఘోరం జరగలేదని మైక్ చేజ్ వాపోయారు. బొచ్వానా ఫారెస్టు రేంజర్ల నుంచి ఆయుధాలు ఉపసంహరించిన తర్వాత గజరాజుల ఊచకోతచ జరిగిందని మైక్ తెలిపారు. ఓకవాంగా డెల్టాలోని ప్రసిద్ధ సంరక్షణ కేంద్రంలో ఈ ఘోరకలి చోటుచేసుకుంది. ఆఫ్రికాలో అత్యధిక ఏనుగుల జనాభా సుమారు 1,35,000 ఉన్నది ఒక్క బొచ్వానాలోనే. జాంబియా, అంగోలా దేశాల్లో ఏనుగుల జాతిని దాదాపుగా అంతం చేసిన అక్రమరవామాదారులు ఇప్పుడు బొచ్వానా మీద పడ్డారని మైక్ చేజ్ పేర్కొన్నారు. ఖడ్గమృగాలకు కూడా ఈ వేటగాళ్ల నుంచి ముప్పు ఎదురవుతున్నదనీ..ఈ నేపథ్యంలో ఈ ఏనుగుల దుండగులు ఈ దారుణానికి ఒడిగట్టారని బొచ్వానా టూరిజం మంత్రి షెకేడీ ఖామా ధృవీకరించారు. కాగా దీనిపై విచారణ కొనసాగుతోంది. 

Don't Miss