విమానంలో చేప పిల్లల్ని పట్టికెళ్లి ఏం చేస్తున్నారో తెలుసా..!!

21:50 - September 4, 2018

అమెరికా : చేపల్ని పెంపకంపై ఇప్పుడు కోట్లాది రూపాయలు టర్నోవర్ అవుతున్నాయి. చేపల్ని ఎక్కువగా తినమని వైద్యులు కూడా చెబుతుంటారు. ఒకప్పుడు కాలువల్లోను, నదుల్లోను, సముద్రాల్లోను పెరిగిన చేపల్నే తినేవారు. కానీ గత కొంతకాలంగా చేపల చెరువుల్లో ఒక వ్యాపారంగా మారిపోయాయి. ఇక అసలు విషయానికి వస్తే చేపల్ని ఒకచోటి నుండి మరొక చోటికి తరలించేందుకు సాధారణంగా రోడ్డు మార్గాలను..లేదా నీటి మార్గాల ద్వారా కానీ విమానం ద్వారా చేపల్ని ఒకచోటి నుండి మరొకచోటికి తరలించటం కూడా జరుగుతోంది. వాటికి తీసుకెళ్లి అతి ఎతైన ప్రదేశం నుండి ఆ చేపల్ని గాల్లోంచి కొండ ప్రాంతాలలో వుండే చెరువుల్లోకి జారవిడుస్తున్నారు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే..అంత ఎత్తునుండి జారవిడిచినా మీనాలు చక్కగా చెరువుల్లోకి క్షేమంగా చేరిపోతున్నాయి.

అమెరికాలోని యుటా రాష్ట్రంలో అక్కడి వైల్డ్‌లైఫ్ రీసోర్సెస్ ఈ పని చేస్తున్నది. కొండ ప్రాంతాల్లోని చెరువుల్లో చేపల పెంపకానికి ఈ పద్ధతి ఈజీగా ఉండటంతో అక్కడి అధికారులు కొన్నాళ్లుగా ఇదే ఫాలో అవుతున్నారు. విమానం కింది భాగంలో ఉన్న భారీ రంధ్రం నుంచి వేలాది చేపలను కింద ఉన్న చెరువులోకి జార విడుస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారిపోయింది. గతంలో పాల క్యాన్లలో చేపలను వేసి, వాటిని గుర్రాలపై పైకి తరలించి చెరువుల్లో వేసేవారు. కానీ దానికి సమయం ఎక్కువ, సుదీర్ఘ ప్రక్రియ కావడంతో విమానంతో చేపల్ని తరలించటం సునాయాసంగా మారిపోవటం..పైగా తక్కువ సమయంలోనే పని పూర్తి కావటంతో దీన్నే కొనసాగిస్తున్నామని సదరు విమాన చేపల తరలింపుదారులు తెలిపారు. కాగా ఇవన్నీ చిన్నచిన్న చేప పిల్లలు కావడంతో అంత ఎత్తు నుంచి కింద పడినా వాటిలో 95 శాతం వరకు బతికే ఉంటున్నాయంటున్నారు సదరు నిర్వాహకులు.

Don't Miss